ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ దే విజయం: కవిత

TRS will win every election says Kavitha
  • నల్గొండలో టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టిందన్న కవిత
  • మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు చెపుతున్నామని వ్యాఖ్య
  • రాష్ట్ర ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారన్న కవిత
తెలంగాణ ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పే దీనికి నిదర్శనమని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ కు ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలను తెలియజేస్తున్నానని అన్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర ఆలయంలో కుటుంబీకులతో కలిసి కవిత పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నల్గొండలో హ్యాట్రిక్ సాధించామని... ఇకపై రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ దే విజయమని అన్నారు. ప్రతి ఏటా చేసినట్టే ఈ ఏడాది కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా నీలకంఠేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించామని చెప్పారు. స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.
Go Back to Shorts
Kavitha
TRS
KCR
Munugode

More Telugu News