ఉప ఎన్నికల ఫలితాల్లో.. 4 రాష్ట్రాల్లో బీజేపీ హవా

BJP leads in 4 seats in bypolls
  • ఫలితాల్లో ముందంజలో బీజేపీ అభ్యర్థులు
  • మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ అభ్యర్థి లీడ్
  • బీహార్ బైపోల్ ఫలితాల్లో దూసుకెళుతున్న ఆర్జేడీ అభ్యర్థి
ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఆదివారం కౌంటింగ్ చేపట్టిన విషయం తెలిసిందే!ఇందులో నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒకటి తెలంగాణ కాగా, మరొకటి మహారాష్ట్ర.. మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్ కు జరిగిన బైపోల్ లో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన పార్టీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్న రాష్ట్రాల విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్ లోని గోలా గోక్రనాథ్, హర్యానాలోని ఆదంపూర్, బీహార్ లోని గోపాల్ గంజ్, ఒడిశాలోని ధాంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్ లో ఉంది. బీహార్ లోని మరో అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అభ్యర్థి ముందంజలో దూసుకుపోతున్నారు.
Go Back to Shorts
bypolls
4 states
BJP
reslults

More Telugu News