వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి మాజీ హోం మంత్రి సుచరిత రాజీనామా
- జగన్ కేబినెట్ లో హోం మంత్రిగా పనిచేసిన సుచరిత
- మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవి కోల్పోయిన వైనం
- పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి
- తన నియోజకవర్గానికే పరిమితమవుతానంటూ తాజాగా ప్రకటన
తదనంతర పరిణామాల్లో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా సుచరిత నియమితులయ్యారు. తాజాగా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు శుక్రవారం సుచరిత ప్రకటించారు. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి తెలియజేశానని కూడా ఆమె తెలిపారు. ఇకపై తన సొంత నియోజకవర్గం ప్రత్తిపాడుకే పరిమితమవుతానని ఆమె పేర్కొన్నారు. సుచరిత ప్రకటనపై వైసీపీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.