Pakistan: జింబాబ్వేను స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన పాక్

Pakistan restricts Zimbabwe for low score
షార్ట్స్‌లో చూడండి
టీ20 వరల్డ్ కప్ లో జింబాబ్వేతో మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్లు రాణించారు. పెర్త్ లో జింబాబ్వేను తక్కువ స్కోరుకు పరిమితం చేశారు. 

ఈ మ్యాచ్ లో జింబాబ్వే  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్ బౌలర్ల ధాటికి భారీ స్కోరు సాధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

జింబాబ్వే ఇన్నింగ్స్ లో షాన్ విలియమ్స్ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో పేసర్ మహమద్ వాసిమ్ జూనియర్ 4 వికెట్లు తీయగా, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. హరీస్ రవూఫ్ 1 వికెట్ తీశాడు. పాక్ కొత్త బంతి బౌలర్లు షహీన్ అఫ్రిది, నసీమ్ షా ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్టు కూడా తీయలేకపోయారు.
Go Back to Shorts
Pakistan
Zimbabwe
Super-12
T20 World Cup
Perth

More Telugu News