కరోనా నోటి టీకా పంపిణీని మొదలుపెట్టిన చైనా.. ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్
- నోటి టీకాను అభివృద్ధి చేసిన కాన్సినో బయోలాజిక్స్
- చైనా, పాకిస్థాన్, హంగేరి సహా పలు దేశాల్లో పరీక్షలు
- 20 సెకన్లలోనే టీకా ప్రక్రియ పూర్తి
- ముక్కు ద్వారా తీసుకునే టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్
నోటి ద్వారా టీకాను తీసుకోవడం వల్ల వైరస్ శ్వాసనాళంలోకి వెళ్లకముందే అంతం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. చైనాకు చెందిన కాన్సినో బయోలాజిక్స్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. చైనాతోపాటు హంగేరి, పాకిస్థాన్, మలేసియా, అర్జెంటీనా, మెక్సికో దేశాల్లో ఈ టీకాకు పరీక్షలు నిర్వహించింది. ఈ టీకాకు చైనా సెప్టెంబరులోనే అనుమతి ఇచ్చింది. దీంతో తాజాగా పంపిణీ మొదలైంది. కాగా, మనదేశంలో ముక్కుతో తీసుకునే కరోనా టీకాను భారత్ బయోటెక్ ఇప్పటికే అభివృద్ధి చేసినప్పటికీ పంపిణీ మాత్రం ఇంకా మొదలు కాలేదు.