అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు తెలుగు వ్యక్తుల దుర్మరణం
- షెఫీల్డ్ ఏరియాలో దుర్ఘటన
- పికప్ ట్రక్, మినీ వ్యాన్ ఢీ
- మృతులు న్యూ హావెన్ కు చెందినవారు
- క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
ఈ ప్రమాదం షెఫీల్డ్ ఏరియాలోని పైక్ రోడ్ ఇంటర్ సెక్షన్ రూట్ 7 వద్ద జరిగినట్టు తెలుస్తోంది. మృతులు కనెక్టికట్ లోని న్యూ హావెన్ కు చెందినవారిగా భావిస్తున్నారు. కాగా, మృతుల పేర్లను పోలీసులు ఇంకా ప్రకటించలేదు.