కార్గిల్ సెక్టార్లో జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి
- నేడు దీపావళి
- దేశ సరిహద్దులకు వెళ్లిన మోదీ
- జవాన్లతో కలిసి వేడుకలు
- ఇది తన అదృష్టమని వెల్లడి
- జవాన్లు తన కుటుంబ సభ్యులంటూ భావోద్వేగం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. పండుగ రోజున జవాన్లను కలుసుకోవడం సంతోషం కలిగించిందని అన్నారు.
జవాన్లు తన కుటుంబ సభ్యులు అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. దేశాన్ని రక్షిస్తున్న సైనికులను చూస్తుంటే గర్వంగా ఉందని, వారి వల్లే దేశంలో శాంతిభద్రతలు నెలకొన్నాయని వెల్లడించారు. దేశభక్తి దైవభక్తితో సమానమని మోదీ అభివర్ణించారు.