జపనీయులను ఉరకలెత్తిస్తున్న ఆర్ఆర్ఆర్
- నాటు నాటు పాటకు డ్యాన్స్ కట్టిన ప్రముఖ యూట్యూబర్ మాయో
- రాజమౌళి, తారక్, చరణ్ ఇంటర్వ్యూ తర్వాత ప్రత్యేక వీడియో
- 21న విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా
‘‘జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా రామ్ చరణ్, తారక్, ఎస్ ఎస్ రాజమౌళిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మేము ఎంతో ఉత్తేజానికి గురయ్యాం. ఇంటికి తిరిగి వెళుతూ మరో వీడియో చేశాం’’ అంటూ మాయో ట్వీట్ చేసింది. ఈ వీడియోను ఇప్పటికి 47 వేల మందికి పైగా చూశారు. భారత సినిమాలు జపాన్ లో ఆదరణ పొందడం గతంలోనూ జరిగింది. ముఖ్యంగా రజనీకాంత్ సినిమాలకు అక్కడ పెద్ద ఫాలోయింగ్ ఉంది.