Congress: మంత్రాలయంలో రాహుల్ గాంధీ... పంచెకట్టులో రాఘవేంద్రుడి సేవలో కాంగ్రెస్ నేత

rahul gandhi visits mantralayam raghavendra swamy temple
షార్ట్స్‌లో చూడండి
భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ గురువారం కర్నూలు జిల్లా పరిధిలోని మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. జోడో యాత్రలో భాగంగా గురువారం నాటి యాత్రను మంత్రాలయంలో ముగించిన రాహుల్...ఆ తర్వాత రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా పంచెకట్టుతో రాహుల్ గాంధీ ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ మర్యాదలతో రాహుల్ కు వేద పండితులు స్వాగతం పలకగా... రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వెంట ఏపీ, కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
Go Back to Shorts
Congress
Andhra Pradesh
Kurnool District
Mantralayam
Sri Raghavendra Swamy Temple
Bharat Jodo Yatra

More Telugu News