అవమానం నుంచి తేరుకొని టీ20 ప్రపంచ కప్ లో అందరికంటే ముందే సూపర్12 చేరిన శ్రీలంక
- తొలి మ్యాచ్ లో నమీబియా చేతిలో ఓటమి పాలైన మాజీ చాంపియన్
- తర్వాత వరుసగా రెండు విజయాలతో ముందుకు
- గ్రూప్–ఎ మూడో మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను ఓడించిన లంక
- సత్తా చాటిన కుశాల్ మెండిస్, బౌలర్లు
నెదర్లాండ్స్ బౌలర్లలో వాండర్ మెర్వే, లీడె చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ ఓవర్లన్నీ ఆడి 146/9 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. మాక్స్ ఒడౌడ్ (53 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71) అజేయ అర్ధ శతకం చేసినా ఫలితం లేకపోయింది. లంక బౌలర్లలో వానిందు హసరంగ మూడు, మహేశ్ తీక్షణ రెండు వికెట్లతో సత్తా చాటారు. కుశాల్ మెండిస్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.