భార్యల మార్పిడి గేమ్‌కు నిరాకరించిందని.. భార్యను బంధించి దారుణానికి ఒడిగట్టిన భర్త
- 5 స్టార్ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న నిందితుడు
- భార్యను హోటల్‌లో బంధించి ‘భార్యల మార్పిడి గేమ్’కు డిమాండ్
- రాజస్థాన్‌లోని బికనేర్‌లో జరిగిన ఘటన
అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొచ్చిన బాధితురాలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మర్‌కు మద్యం, మాదకద్రవ్యాలు తీసుకునే అలవాటు ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, రూ. 50 లక్షల అదనపు కట్నం తీసుకురావాల్సిందిగా అత్తింటి వారు వేధిస్తున్నారని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.