స్మార్ట్ ఫోన్ ను తీసుకువస్తున్న ఎలాన్ మస్క్ సంస్థ టెస్లా!
- సరికొత్త వ్యాపారంలోకి ఎలాన్ మస్క్
- పై ఫోన్ పేరిట టెస్లా నుంచి స్మార్ట్ ఫోన్
- సొంతంగానే ప్రాసెసర్
- శాటిలైట్ నెట్వర్క్ కనెక్టివిటీ
- ధర రూ.80 వేలు ఉండొచ్చని అంచనా!
టెస్లా స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవిగో...
- దీన్ని 'పై ఫోన్' గా పిలుస్తున్నారు.
- 6.7 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ తో వస్తోంది.
- ఈ స్క్రీన్ స్క్రాచ్ రెసిస్టెంట్ మరియు గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.
- నూనె, జిడ్డు మరకల నుంచి రక్షణ కోసం స్క్రీన్ కు ఒలియోఫోబిక్ కోటింగ్ ఉంటుంది.
- 3 రియర్ కెమెరాలు, ఒక ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు.
- రియర్ కెమెరాలు 50 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగినవి. ఫ్రంట్ కెమెరా కెపాసిటీ 40 ఎంపీ.
- 'పై ఫోన్' కోసం టెస్లా సొంతంగానే ప్రాసెసర్ ను అభివృద్ధి చేస్తోంది.
- ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచినట్టు తెలుస్తోంది.
- ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్ ల కంటే ఓ మెట్టు పైనే ఉండేలా ఇందులో శాటిలైట్ ఫోన్ నెట్వర్క్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంటుందట.
- ధర రూ.80 వేల వరకు ఉండొచ్చని అంచనా.
- ఇందులో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడతారన్నది ఇంకా తెలియరాలేదు.