జొన్న చేసే మేలు చాలానే..

13-10-2022 Thu 12:20 | Health
  • ఇందులో ఫైబర్ ఎక్కువ
  • నిదానంగా జీర్ణమవుతుంది
  • దీంతో నియంత్రణలో బ్లడ్ గ్లూకోజ్
  • ఐరన్, ప్రొటీన్ ఇతర పోషకాలు
ప్రపంచం మళ్లీ పాత రోజులను గుర్తు చేసుకుంటోంది. గత తాలూకూ గొప్ప ఆహారాలను మళ్లీ అలవాటు చేసుకుంటోంది. మన తాతల కాలంలో జొన్న, రాగులు, కొర్రలు, సజ్జలు ప్రధాన ఆహారంగా ఉండేవి. కాలక్రమంలో వీటి స్థానంలో బియ్యం, గోధుమ ప్రధాన ఆహారంగా మారిపోయాయి. నేటి జీవన విధానానికి అనుకూలంగా లేని వీటి కారణంగా వచ్చే అనర్థాలపై అవగాహన పెరుగుతోంది. దీంతో సిరిధాన్యాలు, మిల్లెట్స్ పేరుతో మళ్లీ కొర్రలు, రాగులు, జొన్న తదితర వాటిని తినడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. వీటిల్లో  జొన్న (జోవర్) వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

గ్లూటెన్ ఉండదు.. 
గ్లూటెన్ అన్నది ఓ ప్రొటీన్. గోధుమ, బార్లీ జాతి ధాన్యాల్లో ఉంటుంది. గ్లూటెన్ జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి వస్తాయి. కానీ, జొన్నలో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్ పడని వారికి ఇదొక మంచి ప్రత్యామ్నాయం.

ఫైబర్
రైస్, బార్లీతో పోలిస్తే జొన్నలో ఫైబర్ ఎక్కువ. ఒక్కసారి తినే జొన్న ఆహారంతో 12 గ్రాముల ఫైబర్ శరీరానికి అందుతుంది. మన రోజువారీ ఫైబర్ అవసరాల్లో ఇది సగం. ఫైబర్ అధికంగా ఉన్న వాటిని తీసుకోవడం వల్ల స్థూలకాయం, స్ట్రోక్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం, జీర్ణాశయ సమస్యల రిస్క్ తగ్గుతుంది.

రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ
జొన్నలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. దీంతో తీసుకున్న ఆహారం నిదానంగా జీర్ణమవుతుంది. దాంతో కార్బోహైడ్రేట్లు కూడా నిదానంగానే రక్తంలోకి చేరతాయి. రైస్ మాదిరిగా ఒకేసారి చేరడం ఉండదు. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది. 

ప్రొటీన్
100 గ్రాముల జొన్న ఆహారంలో 11 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. కణాలకు శక్తి ఇవ్వడానికి, కండరాల బలోపేతానికి ప్రొటీన్ అవసరం.

ఐరన్
ప్రతి కప్పు జొన్నలో 8.45 గ్రాముల ఐరన్ ఉంటుంది. దీనికితోడు విటమిన్ సీ కూడా ఉండడంతో ఐరన్ ను మన శరీరం పూర్తిగా తీసుకుంటుంది. 

ఎముకలు
జొన్నలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. దీంతో మన శరీరానికి క్యాల్షియం ఎక్కువగా అందుతుంది. మెగ్నీషియం అన్నది క్యాల్షియం సంగ్రహణను పెంచుతుంది.

విటమిన్స్, మినరల్స్
జొన్నలో విటమిన్స్, జింక్, కాపర్, 20 మైక్రో న్యూట్రియంట్లు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా లభిస్తాయి. 

బరువు తగ్గొచ్చు
జొన్నలో ఫైబర్ ఉండడం వల్ల కొంచెం తీసుకున్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. నిదానంగా జీర్ణం అవుతుంది కనుక రోజు మొత్తం మీద తీసుకునే ఆహార పరిమాణం తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి సాయపడుతుంది. 

గుండెకు మంచిది
ఫైబర్ తగినంత ఉండడం వల్ల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ (చెడు కొలెస్ట్రాల్) తగ్గేందుకు సాయపడుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రిస్క్ కూడా తగ్గుముఖం పడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి.
Jowarjonnahealthgoodmillets

More Telugu News

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11
..more