వాటేన్ ఐడియా!.. చేతిపంపు కొడితే నాటుసారా! వీడియో ఇదిగో
- మధ్యప్రదేశ్లో నాటుసారా మాఫియా పథకం
- భూమిలో సారా డ్రమ్ములు అమర్చి పైన చేతిపంపు
- గ్రామం మొత్తం నాటుసారా వ్యాపారులే
ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఈ ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ వ్యవహారం బయటపడిపోయింది. నాటుసారా మాఫియా తెలివిని చూసి పోలీసులు అవాక్కయ్యారు. నాటుసారా ఏరులై పారుతున్న ఈ గ్రామంపై దాడిచేసిన పోలీసులు ఈ సరికొత్త ఏర్పాటు చూసి నోరెళ్లబెట్టారు. గ్రామంలోని దాదాపు ప్రతి ఇంట్లోనూ నాటుసారా తయారుచేస్తున్నట్టు గుర్తించారు. డమ్ముల కొద్దీ నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. తయారీదారులపై కేసులు నమోదు చేశారు.