Andhra Pradesh: గ్రూప్‌-4 ప్రిలిమ్స్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన ఏపీపీఎస్సీ

appsc releases group 4 results
షార్ట్స్‌లో చూడండి
ఏపీ రెవెన్యూ శాఖ‌లో ఖాళీగా ఉన్న జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీ కోసం నిర్వ‌హించిన గ్రూప్‌-4 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ప్రిలిమ్స్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) బుధ‌వారం రాత్రి విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష‌ను జులై 31న ఏపీపీఎస్సీ నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. 

ఈ ప‌రీక్ష‌కు మొత్తం 2,11,341 మంది అభ్య‌ర్థులు హాజ‌రు కాగా... మెయిన్ ప‌రీక్ష‌కు 11,574 మంది అభ్య‌ర్థులు అర్హ‌త సాధించిన‌ట్లు ఏపీపీఎస్సీ వెల్ల‌డించింది. మెయిన్స్‌కు ఎంపిక అయిన వారి వివ‌రాల‌ను త‌న వెబ్‌సైట్‌లో ఉంచిన‌ట్లు తెలిపింది. మెయిన్స్ ప‌రీక్ష‌ను ఎప్పుడు నిర్వ‌హించ‌నున్న విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
Go Back to Shorts
Andhra Pradesh
APPSC
Group 4

More Telugu News