పంత్ వెంటపడొద్దంటూ బాలీవుడ్ నటి ఊర్వశి పై అభిమానుల ఆగ్రహం
Add ap7am to your home Screen

పంత్ వెంటపడొద్దంటూ బాలీవుడ్ నటి ఊర్వశి పై అభిమానుల ఆగ్రహం

Rishabh pant fans angry on urvashi rautela
  • గతంలో ఇద్దరూ ప్రేమించుకున్నట్లు వార్తలు
  • వాటిని ఖండించిన రిషబ్ పంత్
  • అయినా అతడిని వెంబడిస్తున్న ఊర్వశి 
  • తాజాగా ఆస్ట్రేలియా వెళ్లిన బాలీవుడ్ నటి
భారత యువ క్రికెటర్ రిషబ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా గతంలో ప్రేమలో మునిగి తేలారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇద్దరూ చాన్నాళ్లు డేటింగ్ చేశారని గుసగుసలు వినిపించాయి. అయితే, ఊర్వశీతో తనకు ఏ సంబంధం లేదని పంత్ స్పష్టం చేశాడు. తన ప్రేయసి ఈషా నేగిని ప్రపంచానికి పరిచయం చేశాడు. అయినా పంత్ ను ఊర్వశి వదలడం లేదు. ఆర్ పీ అని పరోక్షంగా అతడిని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తోంది. ఆర్ పీ తన కోసం ఢిల్లీ వచ్చి హోటల్ లాబీలో రాత్రంతా ఎదురు చూశాడని ఓ ఇంటర్వ్వూలో కామెంట్ చేసింది. దీనిపై పంత్ ఘాటుగానే స్పందించాడు. కొందరు చీప్ పబ్లిసిటీ కోసం ఇలా మాట్లాడుతుంటారని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఓ దశలో ‘అక్కా.. నన్ను వదిలెయ్’ అని కూడా అన్నాడు. 

అయినా పంత్ ను ఊర్వశి వదలడం లేదు. అతను ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షం అవుతోంది. మొన్న ఆసియా కప్ జరిగిన దుబాయ్ స్టేడియంలో కనిపించిన ఊర్వశి ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియాతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన పంత్ ను అనుసరించింది. ఆస్ట్రేలియా వెళ్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను నా ప్రేమను అనుసరిస్తున్నా.. అది నన్ను ఆస్ట్రేలియా తీసుకెళ్తోందని విమానంలో దిగిన ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. తాను పంత్ కోసమే ఆస్ట్రేలియా వెళ్తున్నానని హింట్ ఇచ్చింది. ఈ విషయంపై క్రికెట్ అభిమానులు ఊర్వశిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం కోసం ఆడుతున్న పంత్ ను వేధిస్తోందని విమర్శిస్తున్నారు. 

ఇలా ఓ అబ్బాయి మహిళా క్రికెటర్ వెంట పడితే ఈ సమాజం ఊరుకునేదా అని ప్రశ్నిస్తున్నారు. పంత్ వద్దంటున్నా ఊర్వశి ఓ సైకోలా అతడిని వెంబడిస్తోందని దుయ్యబట్టారు. కానీ, వీటిని బాలీవుడ్ నటి అస్సలు పట్టించుకోవడం లేదు. ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత లెహెంగాలో దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన రౌతేలా.. ‘తనను ఎలా మరచిపోగలను. మరణం మనిషికి వస్తుంది. మనసుకు కాదు’ అని మరో పోస్ట్ చేసింది. అయితే, దీపావళి వేడుకకు సంబంధించి ఓ ఈవెంట్లో పాల్గొనేందుకే ఊర్వశి ఆస్ట్రేలియా వెళ్లిందన్న వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఊర్వశి విషయంలో తన ప్రమేయం లేకుండానే పంత్ వార్తల్లో ఉంటున్నాడు.
Team India
rishab pant
Bollywood
urvashi rautela
T20 World Cup
Australia
fans

More Telugu News