అప్ డేట్ అవండి సార్.. సీఎంపై వర్ల రామయ్య విమర్శలు

Varla Ramaiah satires on CM Jagan
  • కాకినాడలో యువతి హత్య
  • దిశ చట్టం అమలు చేయాలన్న సీఎం జగన్
  • ప్రభుత్వ అవగాహన రాహిత్యం అంటూ వర్ల రామయ్య వ్యాఖ్యలు
కాకినాడలో దేవిక అనే విద్యార్థిని హత్యకు గురికావడం పట్ల సీఎం జగన్ స్పందిస్తూ, దిశ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించడం తెలిసిందే. అయితే, వర్ల రామయ్య ఓ ట్వీట్ ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు. 

ముఖ్యమంత్రిగారూ... అప్ డేట్ అవండి సార్ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. "మీ ప్రభుత్వ అవగాహన రాహిత్యం మరోసారి బయటపడింది. రాష్ట్రంలో ఇంకా అమలుకు నోచుకోని దిశా చట్టాన్ని అమలు చేయండి అని మీరు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. కాకినాడలో ఓ యువతి హత్యకు గురైతే, మీరు వెంటనే దిశా చట్టం అమలు చేయండి అని పోలీసులను ఆదేశించడం ఏమిటి?" అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Varla Ramaiah
CM Jagan
Devika
Murder

More Telugu News