Andhra Pradesh: ఈ నెల 14న ఏపీలోకి రాహుల్ యాత్ర‌... జోడో యాత్ర మ్యాప్‌ను డీజీపీకి అందించిన ఏపీసీసీ నేత‌లు

rahul gandhi yatra will enter into andhra pradesh on 14th of this month
షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ఈ నెల 14న ఏపీలోకి ప్ర‌వేశించ‌నుంది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో కొన‌సాగుతున్న రాహుల్ యాత్ర‌... ఈ నెల 14న ఏపీలోని అనంత‌పురం జిల్లా డీ హీరేహాళ్ కు చేర‌నుంది. ఏపీ, క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు గ్రామ‌మైన డీ హీరేహాళ్ కు చేర‌డంతో రాహుల్ యాత్ర ఏపీలోకి ప్ర‌వేశించిన‌ట్లు అవుతుంది.

డీ హీరేహాళ్ నుంచి ఏపీలో ప్రారంభం కానున్న‌ రాహుల్ యాత్ర.. ఈ నెల 21 దాకా రాష్ట్రంలోనే కొన‌సాగ‌నుంది. ఈ నెల 14న జ‌రిగే యాత్ర త‌ర్వాత రాహుల్ త‌న పాద‌యాత్ర‌కు 4 రోజుల పాటు విరామం ఇవ్వ‌నున్నారు. ఆ త‌ర్వాత తిరిగి 18న ఏపీలో యాత్ర‌ను కొన‌సాగించ‌నున్న రాహుల్‌... 21 దాకా ఏపీలోనే యాత్ర సాగిస్తారు. ఈ మేర‌కు ఏపీసీసీ నేత‌లు గిడుగు రుద్ర‌రాజు, జేడీ శీలం, రాజీవ్ ర‌త‌న్‌లు శ‌నివారం డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డిని క‌లిసి యాత్ర రూట్‌మ్యాప్‌ను అంద‌జేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Congress
Rahul Gandhi
Bharat Jodo Yatra
AP DGP

More Telugu News