సినీ దర్శకుడు గుణశేఖర్ ఇంట శుభకార్యం

Director Guna Sekhar daughter engagement
  • రవి ప్రక్యాతో గుణశేఖర్ కుమార్తె నీలిమ నిశ్చితార్థం
  • కార్యక్రమానికి హాజరైన సినీ ప్రముఖులు
  • నిర్మాతగా వ్యవహరిస్తున్న నీలిమ
ప్రముఖ సినీ దర్శకుడు గుణశేఖర్ ఇంట శుభకార్యం జరిగింది. ఆయన కుమార్తె నీలిమ నిశ్చితార్ణం రవి ప్రక్యాతో వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.  

ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా నీలిమ స్పందిస్తూ... తన జీవితకాల ప్రయాణం మొదలయిందని చెప్పారు. ఆమెకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు నీలిమకు ముందు నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. దీంతో, ఆమె నిర్మాతగా మారారు. తన తండ్రి తెరకెక్కించిన 'రుద్రమదేవి' సినిమాకు ఆమె సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు 'శాకుంతలం' చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Go Back to Shorts
Guna Sekhar
Tollywood
Daughter Engagement

More Telugu News