దత్తన్న అలయ్ బలయ్‌లో సందడి చేసిన చిరంజీవి
- నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్
- డోలు వాయిస్తూ డ్యాన్స్ చేసిన చిరంజీవి
- కార్యక్రమానికి హాజరు కానున్న ఏపీ, తెలంగాణ గవర్నర్లు
అలయ్ బలయ్ వేడుకలకు వచ్చిన చిరంజీవి కార్యక్రమంలో సందడి చేశారు. దత్తాత్రేయతో కలిసి మెడలో డోలు వేసుకుని చిరంజీవి ఉత్సాహంగా డోలు వాయించారు. డోలు వాయిద్యానికి అనుగుణంగా ఆయన డ్యాన్స్ కూడా చేశారు. డోలు వాయిస్తూ డ్యాన్స్ చేస్తున్న చిరుతో కార్యక్రమంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు కూడా డోలు వాయిస్తూ సందడి చేశారు.