Salman Khan: మై డియ‌ర్ చిరు ఐలవ్యూ.. స‌ల్మాన్ ఖాన్ వీడియో వైర‌ల్

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రను పోషించారు. మసూద్ భాయ్ పాత్రలో ఆయన తనదైనశైలిలో అదరగొట్టారు. ఇద్దరి మధ్య వచ్చే సీన్లు, పాట సినిమాలో హైలైట్ గా ఉన్నాయి. 

మరోవైపు, సినిమా హిట్ అయిన నేపథ్యంలో చిరంజీవిని ఉద్దేశించి సల్మాన్ ఖాన్ ఒక వీడియో సందేశాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. 'మైడియర్ చిరు గారు ఐలవ్యూ. 'గాడ్ ఫాదర్' సినిమా బాగా ఆడుతోందని విన్నా. మీకు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉంటాయి. వందేమాతరం' అని వీడియో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Salman Khan
Chiranjeevi
God Father Movie
Tollywood
Bollywood

More Telugu News