సీఎన్ఎన్ ఛానల్ పై 475 మిలియన్ డాలర్లకు పరువునష్టం దావా వేసిన డొనాల్డ్ ట్రంప్
- ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేసిన ట్రంప్
- తనపై తప్పుడు కథనాలను ప్రచురిస్తోందన్న ట్రంప్
- రాజకీయంగా దెబ్బతీయాలనుకుంటోందని మండిపాటు
తనను జాత్యహంకారిగా, రష్యాకు బానిసగా, హిట్లర్ గా, తిరుగుబాటుదారుడిగా తప్పుడు కథనాలతో పాఠకులకు చూపిస్తోందని తెలిపారు. మరోవైపు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా సీఎన్ఎన్, ది న్యూయార్క్ టైమ్స్ తదితర మీడియా సంస్థలపై విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. ఫేక్ న్యూస్ అంటూ వాటిని విమర్శించేవారు.