బోయపాటి సినిమాలో రామ్ జోడీగా సాక్షి వైద్య!
- రామ్ 20వ సినిమాకి సన్నాహాలు
- దర్శకుడిగా బోయపాటి
- దసరా తరువాత రెగ్యులర్ షూటింగ్
- వచ్చే వేసవిలో విడుదల చేసే ఆలోచన
కెరియర్ పరంగా రామ్ కి ఇది 20వ సినిమా. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మొదలు చాలామంది కథానాయికల పేర్లు వినిపించాయి. ఎవరిని ఎంపిక చేస్తారా అని అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా 'సాక్షి వైద్య' పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఆమెను ఎంపిక చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
అఖిల్ 'ఏజెంట్' సినిమాతో సాక్షి వైద్య పరిచయమవుతోంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదల కాకముందే రామ్ జోడీగా సాక్షి వైద్య ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఉన్నాయి. నెమ్మదిగా సాక్షి వైద్య స్పీడ్ పెంచుతుందేమో చూడాలి.