Tulasi Reddy: కుప్పంను పులివెందులతో సమానంగా అభివృద్ధి చేస్తానన్న జగన్ పై తులసిరెడ్డి విమర్శలు

Tulsi Reddy criticizes Jagan for developing Kuppam on par with Pulivendula
షార్ట్స్‌లో చూడండి
నిన్న కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కుప్పంను చంద్రబాబు ఏమాత్రం అభివృద్ధి చేయలేదని... ఆయన ఒక చేతకాని నేత అని అన్నారు. కుప్పంను తన సొంత నియోజకవర్గం పులివెందులతో సమానంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. జగన్ వ్యాఖ్యలపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సెటైర్లు వేశారు. కుప్పంను పులివెందులతో సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. 

పులివెందులలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదని తులసిరెడ్డి చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, జగన్ చెల్లెలు అయిన సునీత కుటుంబానికే పులివెందులలో రక్షణ లేదని చెప్పారు. అలాంటి పులివెందులను ఇతర నియోకవర్గాలతో పోల్చడం సిగ్గుచేటని అన్నారు. జగన్ ఇస్తున్న అమ్మఒడి, ఆసరా, చేయూత తదితరాలన్నీ నాన్న బుడ్డీకి చాలడం లేదని ఎద్దేవా చేశారు. ముట్టిముంత ఇచ్చి వెండి చెంబును దొంగిలించినట్టుగా వైసీపీ తీరు ఉందని అన్నారు.
Go Back to Shorts
Tulasi Reddy
Congress
Jagan
YSRCP
Pulivendula
Chandrababu
Telugudesam

More Telugu News