సగం గడ్డం గీశాక డబ్బులు అడిగిన క్షురకుడు.. షేవింగ్ పూర్తయ్యాక ఇస్తాననడంతో గొడవ.. ఇద్దరి హత్య
- మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఘటన
- బాధితుడి గొంతు కోసి చంపేసిన క్షురకుడు
- ఆగ్రహంతో సెలూన్‌ను తగలబెట్టిన యువకుడి బంధువులు
- క్షురకుడిని పట్టుకుని కొట్టి చంపిన వైనం
దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అది మరింత ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అనిల్ దుకాణంలోని పదునైన ఆయుధంతో వెంకట్ గొంతు గోశాడు. తీవ్రంగా గాయపడిన వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన అతడి బంధువులు సెలూన్ వద్దకు చేరుకుని దానికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత పరారీలో ఉన్న అనిల్‌ను వెతికి పట్టుకుని కొట్టి చంపారు. అతడి ఇంటిని కూడా తగలబెట్టారు. ఈ ఘటనలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.