హైదరాబాద్ లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో.. ఆయనకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో.. ఆయనకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

Posters against Amit Shah in Hyderabad
  • రేపు హైదరాబాద్ కు రానున్న అమిత్ షా
  • రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్న వైనం
  • పరేడ్ గ్రౌండ్ వద్ద కంటోన్మెంట్ యువత పేరుతో పోస్టర్లు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. రేపు ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారు. 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే తెలంగాణ విమోచన దినం కార్యక్రమంలో పాల్గొంటారు. పరేడ్ గ్రౌండ్ లో ఆయన జాతీయ జెండాను ఎగురవేస్తారు. 

మరోవైపు పరేడ్ గ్రౌండ్ వద్ద అమిత్ షాకు, బీజేపీకి వ్యతిరేకంగా నిన్న అర్ధరాత్రి పోస్టర్లను అతికించారు. కంటోన్మెంట్ యువత పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ అభివృద్ధి, ఆత్మగౌరవానికి సంబంధించి 20 ప్రశ్నలను కేంద్రానికి, మోదీకి వీటిలో ఎక్కుపెట్టారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎలా సహాయపడిందని పోస్టర్లలో ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర తాకట్టు పెట్టింది ఎవరని అడిగారు.
Hyderabad
Amit Shah
Posters

More Telugu News