రాజకీయాలు చేయండి ఎదుర్కొంటాం... ఇలాంటి విషయాల్లోకి వైఎస్ కుటుంబాన్ని లాగితే సహించేది లేదు: మంత్రి పెద్దిరెడ్డి
- ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఏపీకి సంబంధమేంటన్న పెద్దిరెడ్డి
- తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
- కావాలనే జగన్ కుటుంబానికి అంటగడుతున్నారని వెల్లడి
అసలు, ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఏపీకి ఏమిటి సంబంధం? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఇందులో జగన్ కుటుంబ సభ్యులను ఎందుకు తీసుకువస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బంధువులు ఈ లిక్కర్ స్కాంలో సూత్రధారులు అయితే, కావాలనే జగన్ కుటుంబానికి దీన్ని అంటగడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాలు చేయండి... ఎదుర్కొంటాం. అంతేకానీ, ఇలాంటి వ్యవహారాల్లోకి వైఎస్ కుటుంబాన్ని లాగితే సహించేది లేదు అంటూ పెద్దిరెడ్డి హెచ్చరించారు.