Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండు రోజుల్లోనే బ్రహ్మాస్త్ర రూ.160 కోట్ల వసూళ్లు.. నిజమేనా..?

Brahmastra crosses Rs 160 crore worldwide in two days does best ever single day business for Hindi film in Tamil Nadu
  • సినిమా అధికారిక ట్విట్టర్ పేజీలో ఇమేజీ పోస్ట్
  • తమిళనాడులో వసూళ్ల పరంగా రికార్డు
  • మొదటి రోజు రూ.1.20 కోట్ల ఆదాయం
బ్రహ్మాస్త్ర రూపంలో బాలీవుడ్ బాక్సాఫీసుపై మరో పిడుగు.. అంటూ పలు కథనాలు రాగా, వాటికి భిన్నంగా సినిమా కలెక్షన్లు జోరుగానే సాగుతున్నాయి. మొదటి రెండు రోజుల్లోనే రూ.160 కోట్ల ఆదాయాన్ని ఈ సినిమా వసూలు చేసినట్టు సమాచారం. వారాంతానికి రూ.250 కోట్లను చేరుకుంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. 

బ్రహ్మాస్త్ర సినిమా అధికారిక ట్విట్టర్ పేజీ.. రెండు రోజుల్లో బాక్సాఫీసు రూ.160 కోట్ల వసూళ్లను నమోదు చేసిందంటూ ఓ గ్రాఫిక్ ఇమేజ్ ను పోస్ట్ చేసింది. హిందీ వెర్షన్ కు డబ్బింగ్ గా తమిళనాడులో విడుదల కాగా, అక్కడ కూడా బ్రహ్మాస్త్ర రికార్డులు తిరగరాస్తోంది. 1.20 కోట్లను మొదటి రోజే రాబట్టింది. తమిళనాట ఓ బాలీవుడ్ సినిమాకు వచ్చిన మొదటి రోజు అత్యధిక ఆదాయం ఇదేనట. ఈ సినిమాను  తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడలోనూ విడుదల చేశారు. 

రణబీర్ కపూర్, అలియాభట్, మౌనీరాయ్ నటించిన ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పించారు. అక్కినేని నాగార్జున సైతం ఈ సినిమాలో ఓ పాత్రను పోషించారు. బ్రహ్మాస్త్ర రెండో వారంలోనూ ఇదే మాదిరి వసూళ్లు కొనసాగిస్తుందా? అన్నది చూడాలి.
Brahmastra
collections
crosses ₹160 crore
two days
Tamilnadu
record

More Telugu News