స్టేడియంలో పాకిస్థాన్ అభిమానులను చితకబాదిన ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్స్.. వీడియోలు ఇవిగో!
- నిన్న షార్జాలో పాక్, ఆఫ్ఘన్ ల మధ్య మ్యాచ్
- ఒక వికెట్ తేడాతో గెలుపొందిన పాక్
- ఆఫ్ఘనిస్థాన్ జిందాబాద్ నినాదాలతో మారుమోగిన స్టేడియం
మరోవైపు ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి విజయం సాధించింది. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరమైన దశలో పాక్ పేస్ బౌలర్ నసీమ్ షా వరుసగా రెండు సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించాడు. దీంతో పాక్ అభిమానులు కేరింతలు కొట్టారు. దీన్ని తట్టుకోలేని ఆఫ్ఘన్ ఫ్యాన్స్ పాకిస్థాన్ అభిమానులను చితకబాదారు.