Gaddar: రేవంత్ రెడ్డితో గ‌ద్ద‌ర్ భేటీ... నూత‌న పార్ల‌మెంటు భ‌వ‌నానికి అంబేద్క‌ర్ పేరు పెట్టేలా చూడాలని విన‌తి

gaddar meets tpcc chief revanth reddy
షార్ట్స్‌లో చూడండి
ప్ర‌జా క‌వి గ‌ద్ద‌ర్ మంగ‌ళ‌వారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్గితో భేటీ అయ్యారు. గాంధీభ‌వ‌న్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌తో రేవంత్ రెడ్డి భేటీ అయిన సంద‌ర్భంగా అక్క‌డికి వ‌చ్చిన గ‌ద్ద‌ర్... రేవంత్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఢిల్లీలో నూత‌నంగా నిర్మించిన పార్ల‌మెంటు భ‌వ‌నం సెంట్ర‌ల్ విస్టాకు భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ పేరు పెట్టేలా కృషి చేయాల‌ని ఆయ‌న రేవంత్ రెడ్డిని కోరారు. 

ఈ సంద‌ర్భంగా నీట్‌గా ప్యాంటు, ష‌ర్ట్‌.. ట‌క్ చేసుకుని కనిపించిన గ‌ద్ద‌ర్ కొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం ఇదే డిమాండ్‌తో బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను గ‌ద్ద‌ర్ క‌లిసిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు స‌మావేశాల్లో కూడా గ‌ద్ద‌ర్ కొత్త లుక్కులో క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.
Go Back to Shorts
Gaddar
Revanth Reddy
TPCC President
Telangana
Congress

More Telugu News