చైనా నుంచి భారత్ ఇది నేర్చుకోవాలి: ప్రముఖ ఇన్వెస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలకు సీఈఓల్లా వ్యవహరించాలని వ్యాఖ్య
- చైనాలోని రాష్ట్రాల మధ్య పోటీతత్వం భారత్కు ఆదర్శం కావాలన్న నిఖిల్ కామత్
- టెక్ రంగంలో అమెరికా, చైనాలతో పోలిస్తే మనకు 'రిస్క్ క్యాపిటల్' కొరత
- అయితే, మౌలిక వసతుల కల్పనలో భారత్లో ఖర్చు చాలా తక్కువ అన్న కామత్
భారతదేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కార్పొరేట్ సంస్థల సీఈఓల తరహాలో ఎందుకు పోటీ పడకూడదు? దేశం భారీ లక్ష్యాలను సాధించాలంటే చైనా నుంచి ఈ పోటీతత్వాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ ఇన్వెస్టర్, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ఆంగ్ల టీవీ ఛానల్ నిర్వహించిన సదస్సులో ఆయన ఈ కీలక సూచనలు చేశారు.
చైనా పూర్తిస్థాయి పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించకపోయినప్పటికీ, అక్కడి రాష్ట్రాలు, మునిసిపాలిటీలు కార్పొరేట్ సంస్థల్లా ఒకదానితో ఒకటి తీవ్రంగా పోటీ పడతాయని నిఖిల్ కామత్ వివరించారు. "ప్రతి ప్రావిన్స్ మేయర్ తన ప్రాంతాన్ని ఒక వ్యాపార సంస్థగా భావించి పనిచేస్తారు. ఈ పోటీతత్వాన్ని మనం చైనా నుంచి నేర్చుకోవాలి. మన రాష్ట్రాలు కూడా పరస్పరం పోటీ పడేలా ప్రోత్సహించాలి. ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలకు సీఈఓల వలె వ్యవహరించాలి" అని ఆయన సూచించారు.
భారత్లో అద్భుతమైన టెక్ కంపెనీలను నిర్మించడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని, అయితే అమెరికా, చైనాలతో పోలిస్తే మన దేశంలో 'రిస్క్ క్యాపిటల్' (నష్టభయంతో కూడిన పెట్టుబడులు) కొరత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అంత భారీ స్థాయిలో రిస్క్ క్యాపిటల్ అందుబాటులో లేనప్పుడు, ఆయా దేశాల సంస్థలతో భారత కంపెనీలు కృత్రిమ మేధ (ఏఐ) వంటి రంగాల్లో పోటీ పడటం సవాలుతో కూడుకున్న విషయమని ఆయన స్పష్టం చేశారు.
అదే సమయంలో భారత్లోని సానుకూల అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. "పశ్చిమ దేశాలతో పోలిస్తే భారత్లో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు 30 నుంచి 40 శాతం తక్కువ. అమెరికాలో ఒక డేటా సెంటర్కు ప్లంబింగ్ పనులు చేసే వ్యక్తికి 3 లక్షల డాలర్లు చెల్లించాల్సి వస్తే, ఇక్కడ అదే పనికి అయ్యే వ్యయం చాలా తక్కువ. ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే భారత్లో విద్యుత్ ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి" అని ఆయన గుర్తు చేశారు.