చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను అడ్డుకుంటున్నారు: ధర్మాన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను అడ్డుకుంటున్నారు: ధర్మాన

Dharmana Prasada Rao says Chandrababu is obstructing constitutional systems
  • స్థానిక ఎన్నికల వివాదంపై సుప్రీంకోర్టు జోక్యం
  • రాష్ట్రంలో 100 స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపివేసిన ఎస్ఈసీ
  • సుప్రీం ఆదేశాలను స్వాగతించిన వైసీపీ నేత ధర్మాన
ఆంధ్రప్రదేశ్‌లో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్వాగతించారు. 

శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ రాజ్యాంగ వ్యవస్థలను స్వతంత్రంగా, సక్రమంగా పనిచేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రాజ్యాంగ విరుద్ధమైన విధానాలు కొనసాగుతున్నాయనడానికి సుప్రీంకోర్టు ఆదేశాలే నిదర్శనమన్నారు. ఆయన పాలనలో పోలీస్ వ్యవస్థ, ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నాయని ఆరోపించారు.
Advertisement
Dharmana Prasada Rao
Chandrababu Naidu
Andhra Pradesh Local Body Elections
Supreme Court of India
State Election Commission
YSRCP

More Telugu News