దేశంలో కొత్తగా 7,219 కరోనా కేసులు.. 25 మంది మృతి
- 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 9,651 మంది
- 56,745కి తగ్గిన యాక్టివ్ కేసులు
- దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.98
ఇక ప్రస్తుతం దేశంలో 56,745 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.98 శాతంగా, రికవరీ రేటు 98.68 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా, క్రియాశీల రేటు 0.13 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 213.01 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.