దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

India corona updates
  • గత 24 గంటల్లో 7,946 పాజిటివ్ కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 9,828
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 62,748
దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ఈ క్రమంలో గత 24 గంటల్లో 7,946 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అంతకు ముందు రోజు 7,231 కేసులు నమోదు కావడం గమనార్హం. 

మరోవైపు, ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా 9,828 మంది కరోనా నుంచి కోలుకోగా... 37 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,44,33,762కి చేరుకుంది. వీరిలో 4,38,45,680 మంది కోలుకోగా... 5,27,911 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 62,748 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.98 శాతంగా, రికవరీ రేటు 98.67, క్రియాశీల రేటు 0.14 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 212.52 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.
Go Back to Shorts
Corona Virus
India
Updates

More Telugu News