దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 5,439 కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,031
- 65,732కి తగ్గిన యాక్టివ్ కేసులు
ఇక దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.70 శాతంగా, రికవరీ రేటు 98.66 శాతంగా, క్రియాశీల రేటు 0.15 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 88.55 కోట్ల కోవిడ్ టెస్టులను నిర్వహించడం గమనార్హం. మరోవైపు ఇప్పటి వరకు 212.17 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. వీరిలో 94.23 కోట్ల సెకండ్ డోసులు, 15.66 కోట్ల ప్రికాషన్ డోసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 26,36,224 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.