మాజీ ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ

amit shah meets venkaiah naidu in delhi
  • ఇటీవ‌లే ఉప‌రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ విమ‌ర‌ణ చేసిన వెంక‌య్య‌
  • వెంక‌య్య ఇంటికెళ్లి ఆయ‌న‌తో భేటీ అయిన అమిత్ షా
  • వెంక‌య్యతో భేటీ త‌న‌లో ఉత్సాహాన్ని నింపుతుంద‌ని వెల్ల‌డి
బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఢిల్లీలో మాజీ ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడును క‌లిశారు. వెంక‌య్య ఇంటికి వెళ్లిన అమిత్ షా ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అమిత్ షానే సోష‌ల్ మీడియా వేదికగా వెల్ల‌డించారు. వెంక‌య్య‌తో తాను భేటీ అయిన ఫొటోల‌ను కూడా అమిత్ షా పంచుకున్నారు.

ఈ సంద‌ర్భంగా వెంక‌య్య‌ను మాజీ ఉప‌రాష్ట్రప‌తిగానే కాకుండా త‌మ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌గానూ అమిత్ షా అభివ‌ర్ణించారు. వెంక‌య్య‌ను క‌ల‌వడం త‌న‌కు ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంద‌ని తెలిపిన అమిత్ షా.. ఉప‌రాష్ట్రప‌తిగా వెంక‌య్య అనుభ‌వాల గురించి అడిగి తెలుసుకున్న‌ట్లు తెలిపారు. అంతేకాకుండా దేశ ప్ర‌గ‌తిపైనా వెంక‌య్య‌తో చ‌ర్చించిన‌ట్లు అమిత్ షా వెల్ల‌డించారు.
Venkaiah Naidu
Amit Shah
BJP
New Delhi

More Telugu News