విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లపై సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ
- నాడు అసెంబ్లీలో మొసలి కన్నీరు కార్చారని విమర్శలు
- కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్
- ఇచ్చిన హామీలు అమలు చేయాలని స్పష్టీకరణ
- గతంలో ఇచ్చిన హామీలు రికార్డయ్యాయని వెల్లడి
హామీ ఇచ్చిన మేరకు విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని, వారిని వెంటనే క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు లోకేశ్ లేఖ రాశారు. తాను హామీ ఇవ్వలేదని చెప్పేందుకు జగన్ కు ఎలాంటి అవకాశం లేదని, గతంలో ఇచ్చిన హామీలన్నీ రికార్డయ్యాయని లోకేశ్ పేర్కొన్నారు. విపక్షనేతగా ఉన్నప్పుడు మీ వెంట నడిచిన వారిని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విస్మరించడం సరికాదని హితవు పలికారు.