ప్రజల దృష్టిని మళ్లించడానికే జగన్ ఢిల్లీ టూర్ కు వెళ్లారు: విష్ణువర్ధన్ రెడ్డి
- పేదలను దోచుకునే పనిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్న విష్ణు
- ఏపీలో ఉన్నది ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియాలతో కూడిన ప్రభుత్వమని విమర్శ
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితతో పాటు ఏపీ నేతలూ ఉన్నారని ఆరోపణ
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని... వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యను తీర్చి ఉంటే... విజయసాయిరెడ్డి పెట్టిన జాబ్ మేళాకు అంతమంది నిరుద్యోగులు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం జగన్ ఢిల్లీ టూర్ కు వెళ్లారని అన్నారు. ఏపీని వైసీపీ నట్టేట ముంచిందని దుయ్యబట్టారు. గతంలో ఉన్న పరిశ్రమలకే పెయింట్ కొట్టి కొత్త పరిశ్రమలను తెచ్చామని చెప్పుకుంటున్నారని విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్నారని విష్ణు చెప్పారు. ఈ వ్యవహారంలో ఏపీకి చెందిన నేతలు కూడా ఉన్నారని ఆరోపించారు. ఈ స్కాంలో ఎవరెవరున్నారనే విషయాన్ని విచారణ సంస్థలు బయటకు తెస్తాయని చెప్పారు.