అమిత్ షా టూర్‌ను నిర‌సిస్తూ టీపీసీసీ వినూత్న నిర‌స‌న‌... వీడియో ఇదిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమిత్ షా టూర్‌ను నిర‌సిస్తూ టీపీసీసీ వినూత్న నిర‌స‌న‌... వీడియో ఇదిగో

tpcc variety agitation over amit shah tour in telangana
  • మునుగోడు స‌భ‌లో పాల్గొనేందుకు వ‌చ్చిన అమిత్ షా
  • ధ‌ర‌ల పెంపును ప్ర‌స్తావిస్తూ కాంగ్రెస్ శ్రేణులు వినూత్న నిర‌స‌న‌
  • పెట్రోల్‌, డీజిల్ పంపులు, గ్యాస్ సిలిండ‌ర్‌, పాల క్యాన్ మాస్కులతో ప్ర‌ద‌ర్శ‌న‌
బీజేపీ అగ్ర నేత‌, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించేందుకే అమిత్ షా ఈ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా మునుగోడులో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు అమిత్ షా హాజ‌ర‌య్యారు.

అమిత్ షా ప‌ర్య‌ట‌న‌ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ) ఆదివారం మ‌ధ్యాహ్నం మునుగోడులో వినూత్న నిర‌స‌న‌కు దిగింది. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌తో పాటు గ్యాస్ ధ‌ర‌ల‌ను కూడా కేంద్రం భారీగా పెంచిన వైనాన్ని ప్ర‌స్తావిస్తూ... పెట్రోల్‌, డీజిల్ పంపుల‌తో పాటు గ్యాస్ సిలిండ‌ర్ మాస్క్‌ల‌ను ధ‌రించిన కాంగ్రెస్ శ్రేణులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాయి. అంతేకాకుండా పాల ఉత్ప‌త్తుల‌పై జీఎస్టీ విధింపును నిర‌సిస్తూ పాల క్యాన్‌ మాస్క్‌ను ధ‌రించి ఆ పార్టీ శ్రేణులు ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగించాయి.
Telangana
TPCC
Congress
BJP
Amit Shah
Price Raise

More Telugu News