బీజేపీ పోస్ట‌ర్‌పై రాజ‌గోపాల్ రెడ్డి బొమ్మ‌... ఫొటో ఇదిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ పోస్ట‌ర్‌పై రాజ‌గోపాల్ రెడ్డి బొమ్మ‌... ఫొటో ఇదిగో

komatireddy raj gopal reddy releases a poster to invite amit shah for munugodu meeting
  • నేడు బీజేపీలో చేరిపోతున్న రాజ‌గోపాల్ రెడ్డి
  • అమిత్ షాను ఆహ్వానిస్తూ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన మాజీ ఎమ్మెల్యే
  • బీజేపీ పోస్ట‌ర్‌పై తొలిసారిగా క‌నిపించిన కాంగ్రెస్ మాజీ నేత‌
తెలుగు నేల రాజ‌కీయాల్లో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ పేరు విన్నంత‌నే... కాంగ్రెస్ పార్టీ గుర్తుకు వ‌స్తుంది. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంటే... కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ గుర్తుకు వ‌స్తారు. కాంగ్రెస్ పార్టీతో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ది విడ‌దీయ‌రాని బంధ‌మేన‌ని చెప్పాలి. అలాంటిది ఇప్పుడు మొన్న‌టిదాకా మునుగోడు ఎమ్మెల్యేగా కొన‌సాగిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. మ‌రికాసేప‌ట్లో బీజేపీలో చేరిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న‌... త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌నున్నారు.

బీజేపీలోకి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి చేర‌బోతున్న త‌రుణంలో ఆదివారం ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట‌ర్‌ను పోస్ట్ చేశారు. మునుగోడు స‌భ‌కు వ‌స్తున్న అమిత్ షాకు స్వాగ‌తం చెబుతూ కోమ‌టిరెడ్డి ఆ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో అమిత్ షాతో పాటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ల ఫొటోల‌ను అమ‌ర్చిన కోమ‌టిరెడ్డి...కింద త‌న బొమ్మ‌ను ఏర్పాటు చేశారు. వెర‌సి బీజేపీ పోస్ట‌ర్‌పై కోమ‌టిరెడ్డి తొలిసారిగా త‌న ఫొటోను ముద్రించారు.
Komatireddy Raj Gopal Reddy
Munugodu Bypoll
BJP
Congress
Nalgonda District
Amit Shah

More Telugu News