ఆధునిక లుక్స్ తో వచ్చేసిన మారుతి సరికొత్త ఆల్టో కే10
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆధునిక లుక్స్ తో వచ్చేసిన మారుతి సరికొత్త ఆల్టో కే10

All new Alto K10 launched in India
  • ఎక్స్ షోరూమ్ ఆరంభ ధర రూ.3.99 లక్షలు
  • రూ.11,000తో వెంటనే బుకింగ్ చేసుకునే సదుపాయం
  • ఏడు రకాల వేరియంట్లను అందిస్తున్న సంస్థ
  • కారులోపల, బయటా పలు మార్పులు
ఎక్కువ ప్రజాదరణ పొందిన మోడల్ ఆల్టో కే10 నూతన మోడల్ ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గత ఆల్టోలతో పోలిస్తే ఇందులో ఎన్నో ప్రత్యేకతలు వచ్చి చేరాయని చెప్పుకోవాలి. దీని ఎక్స్ షోరూమ్ ఆరంభ ధర రూ.3.99 లక్షలు. కేవలం రూ.11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. 

ఏడు భిన్న రకాల వేరియంట్ ఆప్షన్లలో ఆల్టో కే10ను అందిస్తున్నట్టు మారుతి సుజుకీ తెలిపింది. స్టాండర్డ్, ఎల్ఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ(వో), వీఎక్స్ఐ, వీఎక్స్ఐ(వో), వీఎక్స్ ప్లస్, వీఎక్స్ఐ ప్లస్ (వో) వేరియంట్లను ఫీచర్ల ప్రకారం కస్టమర్లు తమకు నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో హయ్యర్ వేరియంట్ ధర రూ.5.83 లక్షలు. ఆరు రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆల్టో కే10తో పోలిస్తే కొత్త మోడల్ చాలా భిన్నంగా కనిపిస్తుంది. 

ముందు భాగంలో గ్రిల్ ఎక్కువగా కవర్ అయి ఉంటుంది. హెడ్ ల్యాంప్ లు కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి. క్యాబిన్ లోనూ ఎన్నో మార్పులు చేశారు. డ్యాష్ బోర్డు మొత్తం ఆల్ బ్లాక్ థీమ్ తో వస్తుంది. సెమీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ప్రస్తుతానికి ఒక లీటర్ సామర్థ్యం కలిగిన పెట్రోల్ ఇంజన్ తోనే ఆల్టో కే10ను ఆఫర్ చేస్తోంది. తర్వాత సీఎన్ జీ వెర్షన్ కూడా తీసుకురానుంది. లీటర్ కు 24.99 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ అంటోంది. కారులోని నాలుగు డోర్లకు స్పీకర్లు ఏర్పాటు చేశారు. రెండు ఎయిర్ బ్యాగ్ లతో ఇది వస్తుంది. రియర్ పార్కింగ్ అసిస్టెన్స్ కూడా ఉంది. 

Alto K10
New model
launched

More Telugu News