అమరావతి నుంచి అరసవిల్లి వరకు.. అమరావతి రైతుల పాదయాత్ర
- అమరావతిలో నిర్మాణాలు కొనసాగించాలని రైతుల డిమాండ్
- సెప్టెంబరు 12న మహా పాదయాత్ర మొదలు
- పల్లెలు, పుణ్యక్షేత్రాల మీదుగా అరసవిల్లికి
అమరావతిలో ప్రారంభమయ్యే ఈ యాత్ర 60 రోజులకుపైగా కొనసాగి అరసవిల్లిలో ముగుస్తుంది. పల్లెలు, వివిధ పుణ్యక్షేత్రాల మీదుగా యాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అంతకుముందు రోజు దీక్షా శిబిరంలో హోమం నిర్వహిస్తారు.