తెలంగాణలో తాజాగా 406 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 27,348 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 177 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 494 మంది
- ఇంకా 3,095 మందికి చికిత్స
అదే సమయంలో 494 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,29,873 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,22,667 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,095 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మృతి చెందారు.
