జ్యోతి ప్రజ్వలనకు ముందు సంప్రదాయాన్ని పాటించిన తమన్నా భాటియా

  • ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ వేడుక
  • జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆకర్షణగా నిలిచిన తమన్నా
  • దీపం వెలిగించే ముందు పాదరక్షలు తీసేసిన నటి
తమన్నా భాటియాను చూస్తే ఎంతో మోడర్న్ గా, ఫ్యాషన్ గా కనిపిస్తుంది. కానీ, ఆధునికతకు ఆమె ఎంత ప్రాధాన్యం ఇస్తుందో.. సంస్కృతి, సంప్రదాయాలకు సైతం అంతే విలువనిస్తుందని నిరూపించింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ అవార్డ్స్ (2022) ప్రారంభ కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో 13వ ఎడిషన్ అవార్డు విజేతలను ప్రకటించారు.

కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. కొవ్వొత్తితో దీపపు కుందీలోని వొత్తులను వెలిగించాలి. తాప్సీ పన్ను ముందుగా జ్యోతి వెలిగించించింది. వీడియోను గమనిస్తే కాలికి పాదరక్షలతోనే ఆమె ఆ పనిచేసింది. ఆ తర్వాత తన వంతు రాగానే, తమన్నా కాలికి పాదరక్షలు విడిచేసి ముందుకు వచ్చింది. కొవ్వొత్తితో దీపం వెలిగించింది. ఈ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా యూజర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చిన్న పనులే గొప్పగా ప్రభావితం చేస్తాయని, భారత్ దేశ గొప్ప సంస్కృతీ వారసత్వాన్ని ఆమె తెలియజేస్తోందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. (వీడియో కోసం)

Tamannaah
light up lamp
shoes
Indian Film Festival of Melbourne Awar

More Telugu News