ప్రియురాలితో కొణిదెల హీరో పవన్ తేజ్ నిశ్చితార్థం
- నటి మేఘనను పెళ్లాడబోతున్న పవన్ తేజ్
- 'ఈ కథలో పాత్రలు కల్పితం' చిత్రంలో కలిసి నటించిన జంట
- వేడుకకు హాజరైన చిరంజీవి భార్య సురేఖ
ఈ సందర్భంగా పవన్ తేజ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ... ప్రేమతో తమ ప్రయాణం మొదలైందని... ఆమె వల్లే ప్రేమ అంటే ఏమిటో తనకు అర్థమయిందని చెప్పాడు. ఈ వేడుకకు వచ్చి తమను ఆశీర్వదించిన సురేఖ చిన్నమ్మకు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నాడు. చిన్నతనం నుంచి చిరంజీవి బాబాయ్ తనకెంతో సపోర్ట్ చేశారని చెప్పాడు.
ఇక పవన్ తేజ్, మేఘన ఇద్దరూ 'ఈ కథలో పాత్రలు కల్పితం' సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరికీ పరిచయం కలిగింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. ఇప్పుడు వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారు.