ఈ శునకానికి గిటార్ బాగా నచ్చేసినట్టుంది..!

Stray dog listens to live music at a bar You wonot believe what happened next in viral video
షార్ట్స్‌లో చూడండి
అది ఒక బార్. వీధి కుక్క ఒకటి అక్కడకు వచ్చింది. బార్ అంటే సంగీత కార్యక్రమం ఉంటుందని తెలుసు కదా. అదే సమయంలో బార్ లో ఓ వ్యక్తి గిటార్ వాయిస్తున్నాడు. అది ఆ కుక్కకు బాగా నచ్చేసింది. దీంతో గిటార్ వాయిస్తున్న వ్యక్తి వద్దకు వచ్చి నేలపై కూర్చుని శ్రద్ధగా వింది. 

అంతేకాదు.. రెండు కాళ్లపై లేచి నిలబడి చేతులతో గిటార్ వాయించే ప్రయత్నం చేయడం చూసే వారికి ఆనందాన్నిస్తుంది. ఆశ్చర్యం కలిగిస్తుంది. ట్విట్టర్ లోకి ఈ వీడియో చేరిపోవడంతో మంచి స్పందన వస్తోంది. ఇది ఎక్కడి బార్ లోని దృశ్యమో వెల్లడి కాలేదు కానీ, దీన్ని చూసిన వారు కూడా వినూత్నంగా స్పందిస్తున్నారు.
Go Back to Shorts
viral video
dog
plays
guitar
bar
music

More Telugu News