జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడి... ముగ్గురు సైనికుల మృతి

Three army jawans martyred in Jammu Kashmir in a firing exchange with terrorists
  • రాజౌరీ సమీపంలో కాల్పులు
  • పర్గల్ వద్ద సైనిక శిబిరంలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదుల యత్నం
  • ఆత్మాహుతి దాడికి ప్రయత్నించిన వైనం
  • దీటుగా తిప్పికొట్టిన భద్రతా బలగాలు
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు భారత సైన్యం లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మృతి చెందగా, ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు. రాజౌరీ ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్గల్ ఆర్మీ క్యాంపు వద్ద ఈ దాడి జరిగింది. 

సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు యత్నించారు. శిబిరంలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించడాన్ని గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే స్పందించాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ దాడిలో మరో ఐదుగురు సైనికులకు గాయాలయ్యాయి. 

ప్రస్తుతం అక్కడ మరింతమంది ఉగ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో భారీ ఎత్తున గాలింపు చేపడుతున్నారు. పర్గల్ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో బలగాలను తరలిస్తున్నారు.
Go Back to Shorts
Jawans
Death
Terrorists
Jammu And Kashmir

More Telugu News