ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో దేశీయంగా తయారైన శతఘ్నులతో గన్ సెల్యూట్
- ఆగస్టు 15న ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- ఆనవాయతీగా 21 శతఘ్నులతో గన్ సెల్యూట్
- ప్రతిసారి బ్రిటీష్ శతఘ్నుల వినియోగం
- ఈసారి ఆ స్థానంలో ఏటీఏజీఎస్ ఆర్టిలరీ గన్స్
ఈ శతఘ్నులను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్ డీవో) రూపొందించింది. ఈ ఏటీఏజీఎస్ (ఆర్టిలరీ గన్స్) శతఘ్నులను దేశ రక్షణ నిమిత్తం సరిహద్దుల్లో మోహరించారు. అయితే, గన్ సెల్యూట్ కోసం వీటికి కొన్ని మార్పులు చేశారు. ఇవి 155 ఎంఎం కేటగిరీ శతఘ్నులు. ఏటీఏజీఎస్ శతఘ్ని నుంచి వెలువడిన గుండు 48 కిలోమీటర్ల దూరం వరకు దూసుకుపోతుంది.