రెండు చేతులతో 11 రీతుల్లో చకచకా రాస్తున్న చిన్నారి... వీడియో ఇదిగో
- ఒకేసారి రెండు చేతులతో రాస్తున్న మంగళూరు బాలిక
- బాలిక వీడియోను పంచుకున్న రిటైర్డ్ ఎయిర్ మార్షల్
- 10 లక్షల మందిలో ఒకరికి ఇలాంటి శక్తి ఉంటుందని వెల్లడి
- ఈ పవర్‌ను ఆంబిడెక్సెరిటీగా పిలుస్తారన్న అనిల్ చోప్రా
సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నారి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా ఈ చిన్నారి వీడియోను సోషల్ మీడియాలో పోప్ట్ చేశారు. అంతేకాకుండా బాలికలోని అద్భుత సామర్ధ్యాన్ని కూడా ఆయన వివరించారు. 10 లక్షల మందిలో ఒకరికి ఉండే ఈ తరహా శక్తిని ఆంబిడెక్సెరిటీగా పిలుస్తారని తెలిపారు. మెదడులోని రెండు భాగాలు ఒకేసారి ఒకేలా పనిచేయడం వల్ల ఈ తరహా అద్భుత శక్తి సంక్రమిస్తుందని ఆయన వెల్లడించారు. ఆది స్వరూప అనే పేరున్న ఈ బాలిక నిజంగానే ఆది స్వరూపిణే అని ఆయన ప్రశంసించారు.