Uma Maheswari: మెడ భాగంలో స్వ‌ర‌పేటిక విర‌గ‌డంతో ఉమామ‌హేశ్వ‌రి మృతి... వెల్ల‌డించిన పోస్టుమార్టం నివేదిక‌

osmania doctors submitted uma maheswari postmortum report to police
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు చిన్న కుమార్తె ఉమా మ‌హేశ్వ‌రి ఉరేసుకున్న కార‌ణంగానే మృతి చెందింద‌ని పోస్టుమార్టం నివేదిక వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఉమా మ‌హేశ్వ‌రి మృత దేహానికి శ‌వ ప‌రీక్ష నిర్వ‌హించిన‌ ఉస్మానియా ఆసుపత్రి ఫోరెన్సిక్ వైద్యుల బృందం పోస్టుమార్టం నివేదిక‌ను నేడు జూబ్లీ హిల్స్ పోలీసుల‌కు అంద‌జేశారు. ఉరేసుకున్న కార‌ణంగా ఉమా మ‌హేశ్వ‌రి మెడ భాగంలో స్వ‌ర‌పేటిక విరిగింద‌ని, ఈ కార‌ణంగానే ఆమె మ‌ర‌ణింద‌ని వైద్యులు తమ నివేదికలో వెల్ల‌డించారు.  
Go Back to Shorts
Uma Maheswari
NTR
TDP
Suicide
Jubilee Hills Police
Osmania Hospital
Postmortum Report

More Telugu News